రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైకాపా శాసనసభాపక్ష నాయకుడు జగన్ ప్రమాణ స్వీకారానికి సమయం దగ్గరపడుతోంది. దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు, అగ్ర నాయకులు.. రాష్ట్ర పరిధిలోని ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా పరిధిలో పోలీసులు భద్రతను పెంచి, ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విజయవాడ వైపు వెళ్లే భారీ వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్ నియంత్రణ చేపడుతున్నట్లు దక్షిణ కోస్తా ఐజీ ఆర్కే మీనా చెప్పారు. గుంటూరులో ఎస్పీలు రాజశేఖర్ బాబు, విజయరావుతో కలిసి... భద్రత, ట్రాఫిక్ పరంగా తీసుకుంటున్న ఏర్పాట్లను వివరించారు. విజయవాడ వైపు జాతీయ రహదారిపై ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, రోడ్డుప్రమాదాలు జరగకుండా చూస్తున్నట్టు చెప్పారు.
గుంటూరులో ట్రాఫిక్ ఆంక్షలు.. అమల్లోకి నిబంధనలు - vehicles
వైకాపా అధినేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనుంటంతో గుంటూరు జిల్లా పరిధిలో పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.
పోలీస్