గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. డెయిరీ స్వాధీనానికి ప్రభుత్వం ఇచ్చిన జీవోని హైకోర్టు కొట్టివేసినా.. అవినీతి నిరోధక శాఖ అధికారులు, తెనాలి సబ్ కలెక్టర్ అక్కడకు వెళ్లారు. సంస్థకు సంబంధించిన డేటా సర్వర్లను స్వాధీనం చేసుకునేందుకు యత్నించారని అక్కడి సిబ్బంది తెలిపారు. పోలీసు బలగాలతో వచ్చి ప్రధాన కార్యాలయం వద్ద వారిని మోహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:ఇకపై ఆ నంబర్ చెప్తేనే టీకా ఇస్తారు!
ఓవైపు ప్రభుత్వ జీవోను హైకోర్టు కొట్టివేస్తే.. సబ్ కలెక్టర్, పోలీసులు ఎలా వస్తారని సంస్థ సిబ్బంది ప్రశ్నించారు. కోర్టు తీర్పు కాపీ రాకముందే.. కీలక డేటాను ఇక్కడి నుంచి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారుల తీరుని నిరసిస్తూ డెయిరీ వద్ద ఉద్యోగులు ఆందోళనకు దిగారు.