గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం వింజనంపాడు గ్రామంలో కోళ్ళ ఫారాల దగ్గర భౌతిక దూరం మరచి.. మూకుమ్మడిగా మాంసం విక్రయాలు చేస్తున్నారు. కరోనా వ్యాధి మాటే మరిచి ఒకరినొకరు నెట్టుకుంటూ మరీ.... కోళ్ల విక్రయాలు చేస్తున్నారు. ఒక్కో బండిపై ముగ్గురు చొప్పున ప్రయాణాలు చేస్తున్నారు. రెడ్ జోన్లో ఉన్న గుంటూరు నగరం నుంచి మాంసం ప్రియులు గ్రామాల్లోకి వెళుతున్నారు. గత 2 వారాలుగా ఈ విధంగానే జరుగుతున్నా.. అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదనే విమర్శలు వస్తున్నాయి.
చికెన్ కోసం.. భౌతిక దూరాన్ని మరిచారు! - Red Zone news
కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలని నెల రోజులుగా అధికారులు చెబుతున్నా.... చాలా మంది పట్టించుకోవటం లేదు. రెడ్జోన్లో ఉన్న గుంటూరు నగరం నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి మరీ మాంసాన్ని కొనుగోలు చేస్తున్నారు ప్రజలు.
లాక్డౌన్లో చికెన్ విక్రయాలు