గుంటూరు జిల్లా కాకుమాను వద్ద బాపట్ల వెళ్లే రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. ప్రకాశం జిల్లా నూతలపాడుకు చెందిన అల్లాడి సుసన్న(38) కుమారుడు గిజ్జోను(18)తో కలసి ద్విచక్రవాహనంపై పొన్నూరు మండలం మాచవరంలోని వివాహానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో సుసన్న అక్కడిక్కడే మృతి చెందారు. గిజ్జోనుకు తీవ్ర గాయాలు కావటంతో బాపట్ల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి.. కుమారుడికి తీవ్ర గాయాలు - కాకుమానులో రోడ్డు ప్రమాదం
వివాహానికి ద్విచక్రవాహనంపై వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి చెందగా.. కొడుకుకు తీవ్రగాయాలయ్యాయి. గుంటూరు జిల్లా కాకుమాను వద్ద ఈ ప్రమాదం జరిగింది.
రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి.. కుమారుడుకి తీవ్ర గాయాలు