ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కంటైన్మెంట్ జోన్లపై ఆర్డీఓ ప్రత్యేక దృష్టి - గుంటూరు కరోనా వార్తలు

గుంటూరు జిల్లా ధూళిపాళ్లలో ఆర్డీఓ భాస్కర్ రెడ్డి పర్యటించారు. కంటైన్మెంట్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతంలో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

rdo bhaskar reddy visit dhulipalla in guntur
ధూళిపాళ్లలో ఆర్డీఓ పర్యటన

By

Published : May 2, 2020, 5:48 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్లలోని కంటైన్మెంట్ ప్రాంతాన్ని ఆర్డీఓ భాస్కర్ రెడ్డి పరిశీలించారు. అక్కడ చేయాల్సిన పారిశుద్ధ్య పనుల గురించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజూ వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని, హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయించాలని సూచించారు.

ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని ఏఎన్​ఎం​లకు, వాలంటీర్లను ఆదేశించారు. నిత్యావసర సరకులు, పాలు, పెరుగు, కూరగాయలు ఇంటింటికీ పంపిణీ చేయాలన్నారు. గ్రామంలోకి రాకపోకలు నిషేధించాలని చెప్పారు. ఆయనతో పాటు తహసీల్దార్ రమణకుమారి, ఎంపీడీఓ సత్యనారాయణ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details