కరోనా అనిమానుతులను క్వారంటైన్‌కు తరలించవద్దని గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మెడికొండురు మండలం తురకాపాలెం వాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాపిడ్ కిట్లు సక్రమంగా పనిచేయడం లేదని, క్వారంటైన్ కేంద్రం, ఐసోలేషన్ వార్డు సెంటర్లలో సరైన వసతులు లేవన్నారు. అన్ని పరీక్షలు తమ గ్రామంలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే దిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఆ గ్రామ వాసికి కురోనా పాజిటివ్ రాగా చికిత్స అందించారు. అనంతరం రాపిడ్ కిట్ల సాయంతో గ్రామంలో కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురు వాలంటీర్లకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని క్వారంటైన్‌కు తరలించేందుకు అధికారులు గ్రామానికి చేరుకున్నారు. బాధితులను క్వారంటైన్‌కు తరలించడానికి వీల్లేదంటు గ్రామస్థులు వారిని అడ్డుకున్నారు. చేసేది లేక అధికారులు వెనుతిరిగారు.
ఇవీ చూడండి...