170వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల ఆందోళనలు - capital farmers protest news in guntur
రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 170వ రోజుకు చేరుకున్నాయి. 170 రోజులుగా ధర్నా చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో న్యాయస్థానాలే తమకు న్యాయం చేస్తాయని భరోసా పెట్టుకున్నారు.
అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ధర్నాలు 170వ రోజుకు చేరుకున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం బోరుపాలెం, అనంతవరం, తుళ్లూరు, వెంకటపాలెం, మందడం గ్రామాల్లో రైతులు, మహిళలు తమ ఇళ్ల వద్దే ఆందోళనలు కొనసాగించారు. అమరావతికి మద్దతుగా, ముఖ్యమంత్రి జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయస్థానాలు అండగా నిలుస్తాయని రైతులు విశ్వాసం వ్యక్తంచేశారు. తమ ఆందోళనలు 170 రోజులకు చేరుకున్నా ప్రభుత్వం నుంచి ఇసుమంతైనా స్పందన లేదని వాపోయారు.