కేంద్ర ప్రభుత్వం సాధ్యం కాదని చెప్పినా... ప్రత్యేక హోదా గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఇంకా మోసం చేస్తున్నారని భాజపా జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. రాష్ట్రంలో గ్రామ వాలంటీర్లను తీసుకొచ్చే విధానానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్న పురంధేశ్వరి... రేషన్ డీలర్ల పరిస్థితేంటని ప్రశ్నించారు. 29వేల రేషన్ డీలర్లు... అనుసంధానంగా జీవిస్తున్న 20వేల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ డీలర్లకు తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రప్రజలను జగన్ మోసం చేస్తున్నారు: పురంధేశ్వరి - Special Status
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా... సీఎం జగన్ అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తి ప్రజలను ఇంకా మోసం చేస్తున్నారని భాజపా జాతీయ నాయకురాలు పురంధేశ్వరి ఆరోపించారు.

పురంధేశ్వరి
మీడియాతో మాట్లాడుతున్న పురంధేశ్వరి
ఇదీ చదవండీ...