పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గేట్లను అధికారులు మూసేశారు. ఎగువన సాగర్ నుంచి వరద ప్రవాహం ఆగిపోవటంతో అన్ని గేట్లను మూసివేశారు. పులిచింతల జలాశయం పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ఇప్పటివరకు 37 టీఎంసీల నీటిని నిల్వచేశారు. ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు. ప్రస్తుతం 169 అడుగులు ఉంది. కృష్ణా ప్రవాహం ఆగిపోవటంతో పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి వెళ్లాల్సిన ఔట్ ఫ్లో ఆగిపోయింది.
పులిచింతల జలాశయం గేట్లు మూసివేత - పులిచింతల
పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గేట్లను అధికారులు మూసేశారు. పులిచింతల జలాశయం పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ఇప్పటివరకు 37 టీఎంసీల నీటిని నిల్వచేశారు. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి వెళ్లాల్సిన ఔట్ ఫ్లో ఆగిపోయింది.
పులిచింతల రిజర్వాయర్ గేట్లు మూసివేత