నెలరోజులుగా భానుడి భగ భగలతో అల్లడిపోతున్న ప్రజలకు సోమవారం కురిసిన భారీ వర్షంతో వాతావరణం చల్లబడింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కాకుమాను, పెదనందిపాడు, వట్టిచేరుకూరులో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దాదాపు రెండు గంటల పాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. వర్షానికి తోడు ఈదురుగాలులు తోడవటంతో చెట్లు నేలకొరిగాయి.
ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఈదురుగాలులతో వర్షం
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఈదురుగాలులతో భారీవర్షం కురిసింది. ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలు ఉపశమనం పొందారు.
ప్రత్తిపాడు