ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మీ అహంకారానికి చిహ్నంగా మిగిలిపోతుంది: ఆలపాటి రాజా - మీ అహంకారానికి చిహ్నంగా మిగిలిపోతుంది: ఆలపాటి రాజా

తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లు ముఖ్యమంత్రి జగన్ ఆలోచిస్తున్నారని తెదేపా మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. గుంటూరులోని హోం మంత్రి ఇంటివద్ద నిరసనకు వెళ్లిన అమరావతి అఖిలపక్షం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని నల్లపాడు పోలీస్ స్టేషన్​కు తరలించారు.

police who took custody of all party leaders
తెదేపా మాజీ మంత్రి ఆలపాటి రాజా

By

Published : Jan 20, 2020, 1:57 PM IST

సంఖ్యా బలంతో అసెంబ్లీ నిర్వహించి బిల్లు ఆమోదించాలని చూస్తే అది మీ అహంకారానికి చిహ్నంగా మిగిలిపోతుందని తెదేపా మాజీమంత్రి ఆలపాటి రాజా అన్నారు. గుంటూరులోని హోం మంత్రి ఇంటివద్ద నిరసనకు వెళ్లిన అమరావతి అఖిలపక్షం నాయకులను, మహిళా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని... నల్లపాడు పోలీసు స్టేషన్​కు తరలించి నిర్బంధించారు. పోలీస్ స్టేషన్​లోనే డౌన్ డౌన్ సీఎం అంటూ అఖిలపక్షం నాయకులు ఆందోళనకు దిగారు. ఐదు కోట్ల ఆంధ్రులు, రైతులు, మహిళలు గత 34 రోజులుగా రాజధాని కోసం ఆందోళనలు చేస్తుంటే... ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డికి చీమకుట్టినంతైనా లేదన్నారు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న ధోరణిలో జగన్ వ్యవహారిస్తున్నారన్నారు. శాంతియుతంగా ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు చేస్తుంటే వారిని నిర్బంధించి స్టేషన్లకు తరలించడం దారుణమని తెలిపారు.

తెదేపా మాజీ మంత్రి ఆలపాటి రాజా

ABOUT THE AUTHOR

...view details