Police Recruitment Final Exams Date : తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ తుది పరీక్ష తేదీలను పోలీసు నియామక మండలి ప్రకటించింది. సివిల్, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్, ఫింగర్ ప్రింట్ పోస్టులకు విడివిడిగా పరీక్ష తేదీలను ప్రకటించింది. ప్రస్తుతం జరగుతున్న దేహదారుడ్య పరీక్షలు ఈ నెల 5తో ముగియనుండటంతో మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు అన్ని తుది పరీక్షలను పూర్తి చేసేందుకు మండలి ఏర్పాటు చేసింది. ఎస్సై తుది పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉండగా.. ఏప్రిల్ 8న సివిల్, ఐటీ, ట్రాన్స్పోర్టు ఎస్సై, ఫింగర్ ప్రింట్ విభాగం ఏఎస్సై అభ్యర్థులకు మొదటి రెండు పేపర్ల పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అర్ధమెటిక్, రీజనింగ్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంగ్లీషు పరీక్ష జరగనుంది.
'పోలీస్' అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షల తేదీలు వచ్చేశాయ్ - ఏపీ పోలీసు జాబ్స్
Telangana Police Recruitment Final Exams Date: తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ తుది పరీక్ష తేదీలను పోలీసు నియామక మండలి ప్రకటించింది. సివిల్, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్, ఫింగర్ ప్రింట్ పోస్టులకు విడివిడిగా పరీక్ష తేదీలను ప్రకటించింది.
మరుసటి రోజు అంటే 9వ తేదీ ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకూ కేవలం సివిల్ ఎస్సైలకు మూడో పేపర్ జనరల్ స్టడీస్ పరీక్ష, మధ్యాహ్నం తెలుగు లేదా ఉర్దూ పరీక్ష జరగనుంది. ఎస్సై తుది పరీక్షలకు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ 23న ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకూ సివిల్, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ అభ్యర్థులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఈ పరీక్షలకు తెలంగాణలోని 10 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు నియామక మండలి ప్రకటించింది. ఏప్రిల్ 23న మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకూ ఐటీ అండ్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష నిర్వహిస్తారు. మార్చి 12న ఉదయం ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఎస్సై అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష, మధ్యాహ్నం ఫింగర్ ప్రింట్ ఏఎస్సై అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష జరగనుంది. మార్చి 26న ఉదయం ఎస్సై ట్రాన్స్పోర్ట్ టెక్నికల్ పేపర్ పరీక్ష, ఏప్రిల్ 2న ఉదయం డ్రైవర్ కానిస్టేబుల్ పోస్టులకు టెక్నికల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్ 2న మధ్యాహ్నం.. కానిస్టేబుల్ మెకానిక్ అభ్యర్థులకు టెక్నికల్ పేపర్ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలను కేవలం హైదబాద్లోనే నిర్వహించనున్నట్లు రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. అయితే హాల్ టికెట్ల డౌన్లోడ్, డ్రైవింగ్ టెస్టులకు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని నియామక మండలి పేర్కొంది.