ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వృద్ధురాలికి అండగా పోలీసు.. ఓటు వేసేందుకు సహాయం - ఎన్నికల తాజా వార్తలు

గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కొనసాగాయి. బేతపూడి పోలింగ్ కేంద్రానికి నడవలేని స్థితిలో వెళ్లికి ఒక వృద్ధురాలికి పట్టణ సీఐ సాయం చేశారు. తనలోని సేవా హృదయాన్ని చాటుకున్నారు.

police with helping heart helped old women to cast her vote
విధుల్లోనే మానవతను చాటుకుంటున్న సీఐ

By

Published : Feb 9, 2021, 4:58 PM IST

గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. విధులు నిర్వహిస్తునే పోలీసులు ఓటు హక్కును వినియోగించునేందుకు వస్తున్న.. వికలాంగులు, వృద్ధులకు సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు.

సీఐ సేవా హృదయం...

రేపల్లె మండలంలోని బేతపూడి పోలింగ్ కేంద్రం వద్దచి.. నడవలేని స్థితిలో ఉన్న ఒక వృద్ధురాలిని పట్టణ సీఐ సాంబశివరావు తన చేతులలో ఎత్తుకుని పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకెళ్లారు. ఆమె ఓటు హక్కును వినియోగించుకునేందుకు సాయపడ్డారు. సీఐ సేవా హృదయాన్ని చూసిన పలువురు ఆయనను అభినందిస్తున్నారు.

ఇదీ చదవండి:

శంభునిపాలెంలో ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు

ABOUT THE AUTHOR

...view details