ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వర్ణకారుడిపై దాడి.. నలుగురు అరెస్ట్​

స్వర్ణకారుడిపై దాడికి పాల్పడిన ఘటనలో నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత కక్షల కారణంగా గొడవ జరిగినట్లు ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.

pc
స్వర్ణకారుడిపై దాడి.. నలుగురు అరెస్ట్​

By

Published : Feb 11, 2021, 9:09 PM IST

గుంటూరులో స్వర్ణకారుడిపై డాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మిగిలిన వారిని అరెస్టు చేసి వివరాలు వెల్లడించనున్నట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.

పాత కక్షల కారణంగానే..

పాత గుంటూరులో గంటలమ్మ చెట్టు ప్రాంతానికి చెందిన మహ్మద్ హాసన్​, రిహాన్ మధ్య ఏడాది నుంచి వివాదం ఉంది. అది మనసులో పెట్టుకున్న హాసన్.. ఓ రౌడిషీటర్​ను ఆశ్రయించాడు. సదరు రౌడీషీటర్ మనుషుల్ని పంపించి.. రిహాన్ పై దాడి చేయించాడు. సాయంత్రం రౌడీషీటర్​కు చెందిన మనుషులు రిహాన్​ను కర్రలతో చితకబాదారు. ఈ దృశ్యాలన్నీ సమీపంలోని ఓ దుకాణానికి చెందిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దాడిలో రిహాన్ తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

గుంటూరు జిల్లా జైలు నుంచి పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి విడుదల

ABOUT THE AUTHOR

...view details