ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కోట్లు వసూలు చేసి ఉడాయించాడు.. మాకు న్యాయం చేయండి' - పిడుగు రాళ్లలో బంగారం వ్యాపారి నగదుతో పరారీ కేసు వార్తలు

గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ఓ బంగారు వ్యాపారి... భారీగా అప్పులు చేసి ఉడాయించిన ఘటన వెలుగు చూసింది. బాధితులు స్పందనలో గ్రామీణ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కోట్ల రూపాయలతో బంగారం వ్యాపారి పరారీ.. బాధితుల ఫిర్యాదు
కోట్ల రూపాయలతో బంగారం వ్యాపారి పరారీ.. బాధితుల ఫిర్యాదు

By

Published : Dec 4, 2019, 10:11 AM IST

కోట్ల రూపాయలతో ఉడాయించిన బంగారం వ్యాపారి.. బాధితులు ఫిర్యాదు

గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ధనలక్ష్మి జ్యుయలర్స్​ యజమాని.. కాశీ రామారావు తమ వద్ద కోట్ల రూపాయలు డిపాజిట్లు తీసుకుని పరారైనట్లు బాధితులు గ్రామీణ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దాదాపు​ రూ.10 కోట్లతో నవంబర్​ 12న ఉడాయించినట్లు ఎస్పీ దృష్టికి తెచ్చారు. గత 9 ఏళ్లుగా స్థానికంగా వ్యాపారం చేస్తున్న అతడిని నమ్మి అప్పులు ఇచ్చామని.. తమకు న్యాయం చేయాలని కోరారు.

నమ్మించి ముంచేశాడు

తాము రూపాయి రూపాయి కూడబెట్టుకున్న నగదు అన్యాయంగా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధిక వడ్డీ ఇస్తామని చెప్పి వ్యాపారి రామారావు నగదు తీసుకున్నట్లు తెలిపారు. ఆభరణాల కోసం ముందస్తుగా లక్షల రూపాయలు ఇచ్చామని కొంతమంది వాపోయారు.

కేసు నమోదు

బాధితుల ఫిర్యాదు మేరకు ధనలక్ష్మి జ్యుయలర్స్​ యజమాని కొనకండ్ల కాశీ రామారావుపై కేసు నమోదు చేసినట్లు పిడుగురాళ్ల ఎస్సై సుధీర్​ కుమార్​ తెలిపారు. ఇప్పటి వరకూ అందిన ఫిర్యాదుల ఆధారంగా మొత్తం రూ.2 కోట్ల నగదు అక్రమంగా తీసుకెళ్లినట్లు గుర్తించామని చెప్పారు. విచారణ అనంతరం మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.

ఇదీ చూడండి:

'చంద్రబాబు గ్రాఫిక్స్ రాజధానిలో జిల్లేడు మొక్కలే మిగిలాయి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details