ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AYYANNA : మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పై కేసు నమోదు - ayyanna pathrudu in nakarikallu police station

తెదేపా నేత అయ్యన్నపాత్రుడుపై నకరికల్లు పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి, హోం మంత్రి, ఐపీఎస్ అధికారులను కించపరిచేలా అయ్యన్న మాట్లాడారంటూ కండ్లకుంట మాజీ సర్పంచ్ కంఠంనేని కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పై కేసు నమోదు
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పై కేసు నమోదు

By

Published : Sep 18, 2021, 12:52 AM IST

తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై గుంటూరు జిల్లా నకరికల్లు పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది. కండ్లకుంటలో జరిగిన కోడెల వర్ధంతి సభలో అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ సర్పంచ్, వైకాపా నేత కంఠంనేని కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో అయ్యన్నపాత్రుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి, ఐపీఎస్ అధికారులను కించపరిచేలా అయ్యన్నపాత్రుడు మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

ABOUT THE AUTHOR

...view details