ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 1, 2020, 1:18 PM IST

ETV Bharat / state

గుంటూరులో కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ

లాక్​డౌన్​ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తోంది. బయోమెట్రిక్​కు బదులు ఫోటో తీసి నగదు అందజేస్తున్నారు.

కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమం
కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమం

కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమం

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికే పింఛన్లు పంపిణీ చేపట్టింది. వాలంటీర్లు ఉదయం నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, కాకుమాను, వట్టిచెరుకూరు, పెదనందిపాడు మండలాల్లో పింఛన్లు చాలా వరకు పూర్తి చేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వేలిముద్రలకు బదులు ఫోటో తీసి నగదును అందిస్తున్నారు. అయితే కొంతమంది వార్డు వాలంటీర్లు ముఖానికి మాస్కులు ధరించకుండా నగదు పంపిణిీ చేయటం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details