ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేతలతో పవన్​ భేటీ.. పార్టీ విజయావకాశాలపై చర్చ

సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరు, జనసేన పార్టీ విజయావకాశాలపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమీక్షలు ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో జరిగిన తొలి సమీక్షకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన అభ్యర్థులు హాజరయ్యారు.

పవన్ కల్యాణ్ సమీక్ష

By

Published : Apr 21, 2019, 5:04 PM IST

పవన్ కల్యాణ్ సమీక్ష

సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరు, జనసేన పార్టీ విజయావకాశాలపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమీక్షలు ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. తొలి విడత సమీక్షలో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన అభ్యర్థులతో పవన్ సమావేశమయ్యారు.
పోలింగ్ ముగిసిన 10 రోజుల తర్వాత పార్టీ తరఫున జరిగిన మొదటి సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పోలింగ్ కేంద్రాల సరళి, గెలుపు అవకాశాలు, ఈవీఎంల పనితీరుపై పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమకు వందకుపైగా సీట్లు వస్తాయని ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో జనసేన కచ్చితంగా ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందనే విషయంపై పవన్ ఓ అంచనాకు రానున్నారు.

ABOUT THE AUTHOR

...view details