నిడమర్రు, కురగల్లులో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటించారు. కొండవీటి వాగు వద్ద వంతెన పనులు పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ..రాజధాని మారుస్తామని లీకులు ఇవ్వడం సరికాదని, మంత్రులు బాధ్యతగా మాట్లాడాలన్నారు. వారి ప్రకటనలతో ప్రజల్ని గందరగోళానికి గురిచేయొద్దన్నారు. రాజధానిలో రైతు కూలీల సమస్యలను తెదేపా సర్కారు పట్టించుకోలేదు. కనీసం ఈ ప్రభుత్వమైనా రైతు కూలీల సమస్యలను పట్టించుకోవాలన్నారు. అవినీతి జరిగితే విచారణ జరిపి చర్యలు తీసుకువాలన్నారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తే ఎవరూ వద్దనరన్నారు. బొత్స విమర్శలను ఆయన ఖండించారు. రాజధాని ఇక్కడ వద్దని తాను ఎప్పుడూ చెప్పలేదని... సమస్యపై స్పందించాల్సి వస్తే కచ్చితంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిసి పరిస్థితులు వివరిస్తానన్నారు. మెజారిటితో గెలిచిన ప్రభుత్వం తప్పు చేయకుండా రైతులను ఆదుకోవాలన్నారు.
రాజధానిపై సరైన నిర్ణయం తీసుకోండి..:పవన్
ప్రజల్ని గందరగోళం చేయకుండా రాజధానిపై సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. రాజధాని రైతులను ఆదుకోవాలని, సమస్యపై స్పందించాల్సి వస్తే కచ్చితంగా ప్రధానితో మాట్లడుతాన్నారు.
రాజధాని రైతులను పరామర్శించిన పవన్ కల్యాణ్