నదులు సహజ సిద్ధంగా, కాలుష్య రహితంగా ప్రవహిస్తే సమాజం బాగుంటుందని ప్రొఫెసర్ జి.డి.అగర్వాల్ చెప్పేవారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. జి.డి. అగర్వాల్ కన్నుమూసి ఈ నెల11తో రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా... ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు జనసేనాని.
'మన నుడి- మన నది' కార్యక్రమానికి ప్రేరణ ఆయనే: పవన్ కళ్యాణ్
గంగా నది ప్రక్షాళనకు పోరాడి కన్నుమూసిన ఫ్రొఫెసర్ జి.డి. అగర్వాల్ స్ఫూర్తితో నదులను పరిరక్షించుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలను కోరారు. జి.డి. అగర్వాల్ దివికేగి ఈ నెల11తో రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా... ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు జనసేనాని
గంగానదిని పవిత్రతను కాపాడాలంటూ చేసిన 111 రోజులు నిరాహార దీక్ష ఆయనను బలి తీసుకుందన్నారు. కాన్పూర్ ఐఐటీలో ఆచార్యులుగా పనిచేసిన అగర్వాల్ తర్వాత సన్యాసం స్వీకరించి గంగానది ప్రక్షాళన కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. గతేడాది హరిద్వార్ మైత్రి సదన్ ఆశ్రమానికి వెళ్లి ఆయనకు నివాళులు అర్పించినట్లు తెలిపారు. ఈ ఏడాది కోవిడ్ పరిస్థితుల వల్ల వెళ్లలేకపోతున్నానని చెప్పారు. దేశంలోని ఏ నది కాలుష్యానికి గురి కాకూడదని ఆయన చేసిన పోరాటం ఆచరణీయమన్నారు. జనసేన చేపట్టిన మన నుడి - మన నది కార్యక్రమానికి ప్రేరణ కల్పించింది కూడా జి.డి.అగర్వాల్ అని పవన్ స్పష్టం చేశారు. ఆయన స్ఫూర్తితో నదులను పరిరక్షించుకోవాలని కోరారు. ప్రొఫెసర్ జి.డి.అగర్వాల్ రెండో పుణ్య తిధి సందర్భంగా ఆదివారం వెబినార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.