ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వారిని రోడ్డున పడేస్తారా?: పవన్ కల్యాణ్ - పీవీకే నాయుడు తాజా వార్తలు

ప్రజలకు ఉపయోగపడే ఆస్తుల విక్రయం అంటే పాలనా వైఫల్యమేనని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పీవీకే.నాయుడు మార్కెట్‌ను వేలానికి పెట్టడం సరికాదని మండిపడ్డారు.

వారిని రోడ్డున పడేస్తారా?: పవన్ కల్యాణ్
వారిని రోడ్డున పడేస్తారా?: పవన్ కల్యాణ్

By

Published : May 27, 2020, 10:39 PM IST

గుంటూరు పీవీకే.నాయుడు మార్కెట్‌తో జిల్లా ప్రజలకు అనుబంధం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. మార్కెట్‌పై పేదలు ఆధారపడి ఉందని, వారిని రోడ్డున పడేస్తారా? అని ప్రశ్నించారు. సంపద సృష్టి అంటే పెట్టుబడులు తేవాలి.. ఆస్తులు అమ్మడం కాదని హితవు పలికారు. పెట్టుబడులు వచ్చే మార్గాన్ని ప్రభుత్వం అన్వేషించడం లేదని పవన్ ఆరోపించారు. కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే విద్యుత్‌ ఛార్జీలు పెంచారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తుల వేలాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details