ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభం

గుంటూరు జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. కొవిడ్ నిబంధనల ప్రకారం థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే ఓటర్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు.

Early panchayat elections in Guntur district
గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలు తొలివిడత నేడే

By

Published : Feb 9, 2021, 9:56 AM IST

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు భారీ ఎత్తున తరలివస్తున్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే ఓటర్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించారు. తుమ్మపూడిలో పోలింగ్ కేంద్రం సమీపంలో వైకాపా నేతలు ఓటర్లను ఆకర్షించేందుకు బిర్యాని పంచారు.


చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామంలోని పంచాయతీ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ వివేక్ యాదవ్ పరిశీలించారు. తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతోందన్నారు. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు.

కాకుమాను మండలం 12 పంచాయతీలలో తొలి విడత ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. 118 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

తెనాలి రెవెన్యూ డివిజన్​లో తొలి పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. 3వేల 546 పోలీంగ్ స్టేషన్​లు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు శానిటైజర్ వేసి లోపలికి పంపిస్తున్నారు.

బాపట్ల నియోజకవర్గం బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాల్లోని గ్రామ పంచాయతీలో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో అధికారులు జాగ్రత్తలు తీసుకుని ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు.


ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details