గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామానికి చెందిన గడ్డం సీతారవమ్మా నివాసం ఉంటోంది. ఆమెకు తోడుగా పని మనిషి ఉండేది. చాలా సార్లు ఆమె చూస్తుండగానే... సీతారవమ్మ... బీరువాలో నగదు, బంగారు తాచిపెట్టేది. 15 రోజు క్రితం ఇంట్లో చోరీ జరిగింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పని చేసే ఇంటికే కన్నం వేసిన మహిళ
అనంతవరప్పాడులో గడ్డం సీతారవమ్మా ఇంట్లో పని మనిషి చోరీ చేసి అడ్డంగా దొరికింది. ఎప్పటి నుంచే అదును కోసం చూసిన ఆమె... 15 రోజుల క్రితం దొంగతనం చేసింది. బయట వ్యక్తులే వచ్చే చేసి ఉంటారని అనుమానించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కూపీ లాగిన పోలీసులు... పని మనిషే సొత్తు తస్కరించినట్టు తేల్చారు.
యజమాని ఇంట్లో చోరికి పాల్పడిన పని మనిషి
రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేశారు. తన మీద అనుమానం రాకుండా ఆమె చాలా ప్రయత్నాలు చేసింది. పోలీసుల దృష్టి మరల్చింది. కానీ.. చోరీ చేసిన సొత్తు అమ్మకానికి పెట్టే సమయంలో పోలీసులు పట్టుకున్నారు. అసలు దొంగ ఆమె అని తేల్చారు. ఆమెపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.