తన తండ్రికి గుండెపోటు రావటంతో.. తెల్లవారుజామున 5 గంటలకు ఆసుపత్రికి తీసుకువచ్చినా.. వైద్యులు ఎవరూ స్పందించలేదనీ.. దీంతో తన తండ్రి మరణించారని, మృతుడి కుమార్తెలు ఆరోపించారు. గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన బ్రహ్మయ్య అనే 62 ఏళ్ల వృద్ధుడికి గుండెపోటు రావటంతో, తెల్లవారుజామున 5 గంటలకు తీసుకొచ్చినట్లు బ్రహ్మయ్య కుమార్తెలు వివరించారు. కరోనా పరీక్ష పేరుతో వైద్యం ఆలస్యం చేసిట్లు వారు ఆరోపించారు. దీని వల్లే తన తండ్రి మరణించాడనీ వారు కన్నీరుమున్నీరయ్యారు. జిల్లా ఉన్నతాధికారులకు చెప్పినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించటానికి సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు.
వైద్యం అందకే మా నాన్న చనిపోయారు
ప్రాణం పోతుందన్నాఎవరూ పట్టించుకోలేదనీ.. దీంతో వైద్యం అందక తన తండ్రి మరణించారని మృతుడు కుమార్తెలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో జరిగింది.
గుండెపోటుతో వ్యక్తి మృతి
ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా.. బ్రహ్మయ్యకు వైద్యం అందించామనీ.. మూడు రకాల ఇంజెక్షన్లు ఇచ్చిట్లు వివరణ ఇచ్చారు. కరోనా పరీక్షలు నిర్వహించకుండా.. వైద్య పరీక్షలు నిర్వహించటం సాధ్యం కాదని స్పష్టం చేశారు. బ్రహ్మయ్యకు గుండెపోటుతోపాటు బీపీ 62గా ఉందనీ.. అది కూడా అతడి మరణానికి కారణమని తెలిపారు.