ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

No Pension: అందని పెన్షన్లు..అవస్థల్లో వృద్ధులు

గుంటూరు జిల్లాలోని పలు గ్రామాల్లో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రభుత్వం అందించే పింఛన్లు అందక నానా అవస్థలు పడుతున్నారు. సాంకేతిక కారణాలు చూపించి అర్హులైన వారికి తొలగించడంతో ఏం చేయాలో పాలుపోక బిక్కుబిక్కుమంటున్నారు.

pension
pension

By

Published : Sep 2, 2021, 8:30 PM IST

అందని పింఛన్లు...అవస్థల్లో వృద్ధులు

గుంటూరు జిల్లాలోని పలు గ్రామాల్లో సకాలంలో ప్రభుత్వం అందించే పింఛన్​ అందకపోవడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక కారణాలు చూపించి అర్హులైన వారికి ప్రభుత్వం పెన్షన్​ తొలగించింది. ఇదేమని అడిగితే.. నోటీసులు ఇచ్చాము.. న్యాయస్థానానికి వెళ్లి తేల్చుకోవాలంటూ వాలంటీర్లు దురుసుగా సమాధానం చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరి మండలం కాజా గ్రామంలో 19 మందికి ఈనెల పింఛన్ నిలిపేశారు. 20 ఏళ్ళుగా పింఛన్ పొందుతున్న 92 ఏళ్ల వృద్ధురాలు అట్లూరి సీతారావమ్మకు ఈనెల పింఛన్ ఇవ్వలేదు. ఆపిన విషయం ఆమెకు తెలియదు. ఈకేవైసీ చేయని కారణంగా ఆమె పెన్షన్​ ఆపేసినట్లు అధికారులు తెలిపారు.

కాజా గ్రామానికి చెందిన మరో అర్హుడు కంకణాల సాంబశివరావు 11 ఏళ్ళుగా పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరణతో పింఛన్ మంజూరు అయ్యింది. ఆయనకు 8 ఏళ్లుగా పింఛన్​ పొందుతున్నారు. ఈనెల నుంచి పింఛన్​ నిలిపివేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నోటీసు ఇచ్చారు. సాంబశివరావుకు పూర్తిగా ఆరోగ్యం నయం అయిందని నోటీసులో పేర్కొన్నారు. పింఛన్ ద్వారా వచ్చే డబ్బులతో నెల నెలా మందులు కొనుక్కుంటున్నానని ఆయన తెలిపారు. ఇప్పటికీ ఆయన మంచంలోనే ఉన్నారు. వైద్యాధికారులు పరిశీలించకుండానే పింఛన్​ ఆపేయటం దారుణమని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన నేతలకు మాత్రం నెల నెల ఠంచనుగా పెన్షన్​ వస్తోందని సాంబశివరావు కుమారుడు చెప్పారు.

ఇదీ చదవండి: విదేశీ విద్యాదీవెన పథకానికి నిధులు నిలిపివేయటాన్ని నిరసిస్తూ భాజపా ఆందోళన

ABOUT THE AUTHOR

...view details