ETV Bharat effect: గుంటూరు నుంచి పేరెచర్ల వెళ్లే మార్గంలో పలకలూరు వద్ద రహదారి దుస్థితిపై ఈటీవీ భారత్, ఈనాడులో కథనానికి అధికారులు స్పందించారు. రహదారిపై ఉన్న భారీ గోతుల్ని హడావుడిగా పూడ్చేందుకు చర్యలు చేపట్టారు. రాళ్లు, కంకర చిప్స్‌తో గుంతలను నింపారు. వాటిపై కంకర డస్ట్ పోయటం ద్వారా వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా తాత్కాలిక చర్యలు చేపట్టారు. రోడ్డుని చదును చేసే పనులు కూడా నిర్వహిస్తున్నారు.
రహదారి మొత్తం కాకుండా తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతంలో మాత్రమే గుంతలు పూడుస్తున్నారు. చిన్న చిన్న గుంతలు అలాగే వదిలేశారు. మరోవైపు రహదారి దెబ్బతిన్న కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమని నగరపాలక సంస్థ అధికారులు అంగీకరించారు. ఈ మేరకు కమిషనర్ చేకూరి కీర్తి ప్రకటన జారీ చేశారు. రహదారి విస్తరణ కోసం ప్రణాళికలు రూపొందించామని.. అందులో ఇళ్లు, స్థలాలు కోల్పోయే వారి నుంచి సమ్మతి రావాల్సి ఉందని ప్రకటనలో పేర్కొన్నారు. 57 మందికి గాను 38 మంది మాత్రమే సమ్మతించినట్లు వివరించారు.