గుంటూరు నగరంలో దుకాణాలు తెరిచేందుకు అధికారులు సరి- బేసి విధానం అమలు చేయాలని నిర్ణయించారు. రెండున్నర నెలల లాక్ డౌన్ అనంతరం గుంటూరు నగరంలో షాపులు తెరిచేందుకు అధికారులు అనుమతించారు. అయితే మొదటి రోజునే పెద్దఎత్తున జనం రోడ్లపైకి రావటం, దుకాణాలన్నీ తెరవటంతో భౌతిక దూరం కనిపించలేదు. అందుకే నగరంలో సరి, బేసి విధానంలో దుకాణాలు తెరిచేలా చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు దుకాణాలకు 1, 2 నంబర్లు కేటాయించారు. నగరపాలక సంస్థ సిబ్బంది అందుకు సంబంధించిన స్టిక్కర్లు ప్రతి దుకాణానికి అంటించారు. 1వ నంబరు ఉన్న దుకాణాలు సోమ, బుధ, శుక్రవారాల్లో తెరవాల్సి ఉంటుంది. 2వ నంబర్ ఉన్న షాపులు మంగళ, గురు, శనివారాల్లో తెరిచేందుకు అనుమతించారు. ఆదివారం మాత్రం కేవలం అత్యవసరాలకు సంంబధించిన దుకాణాలు మాత్రమే తెరిచే వీలుంది. బుధవారం నుంచే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు.
గుంటూరులో అమల్లోకి సరి- బేసి విధానం
గుంటూరులో రద్దీని తగ్గించేందుకు అధికారులు నూతన విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు. సరి- బేసి విధానం ద్వారా దుకాణాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. బుధవారం నుంచే ఈ విధానం అమల్లోకి వచ్చింది.
odd- even system for opening shops in guntur
గుంటూరు నగరంలో 210 కేసులున్నాయి. కూరగాయల మార్కెట్ వ్యాపారులు పాతిక మందికి కరోనా వచ్చింది. ఈ నేపథ్యంలో వ్యాపార కార్యకలాపాలు జరిగే ప్రాంతాలు, మార్కెట్లపై అధికారులు దృష్టి సారించారు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ మంది ఓ చోట చేరకుండా చర్యలు చేపట్టారు. సరి- బేసి విధానం ద్వారా నగరంలో కేవలం 50శాతం దుకాణాలు మాత్రమే తెరవనున్నారు. తద్వారా సగం మేర రద్దీ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి
కొత్తగా 79 కరోనా పాజిటివ్ కేసులు..ముగ్గురు మృతి