గుంటూరు నగరంలో ఈనెల 25 నుంచి రాత్రి కర్ఫ్యూకు యంత్రాంగం సిద్ధమవుతోంది. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా రాత్రి కర్ఫ్యూ విధించామని.. అందరూ సహకరించాలని మేయర్ కావటి మనోహరనాయుడు విజ్ఞప్తి చేశారు.
గుంటూరులో 25వ తేదీ నుంచి రాత్రి కర్ఫ్యూ - guntur updates
గుంటూరులో ఈ నెల 25 నుంచి రాత్రి కర్ఫ్యూ విధించారు. కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని మేయర్ తెలిపారు. రంజాన్ మాసం కావటంతో మసీదుల వద్ద కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
గుంటూరులో 25వ తేదీ నుంచి రాత్రి కర్ఫ్యూ
రంజాన్ మాసం కావటంతో ముస్లిం సంఘాలతో మేయర్, నగర ఎమ్మెల్యేలు, అధికారులు సమావేశమయ్యారు. మసీదుల వద్ద కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవటంతో పాటు ఎక్కువ మంది గుమికూడకుండా చూడాలని సూచించారు. ముస్లిం సంఘాలు తమ విజ్ఞప్తికి సానూకూలంగా స్పందించాయని మేయర్ కావటి మనోహరనాయుడు, ఎమ్మెల్యే ముస్తఫా తెలిపారు.
ఇదీ చదవండి