ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నదిలో వ్యర్థాలు తొలగించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

తాడేపల్లి సీతానగరం పుష్కరఘాట్​తో పాటు.. సమీపంలోని కృష్ణా నదిలో పేరుకుపోయిన చెత్తను... ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగించారు. సుమారు 400 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

swacha bahrat
swacha bahrat

By

Published : Mar 15, 2021, 10:45 AM IST

Updated : Mar 15, 2021, 11:04 AM IST

నదిలో వ్యర్థాలు తొలగించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం పుష్కరఘాట్లు, కృష్ణానదిలో పేరుకుపోయిన చెత్తా చెదారాలను జాతీయ విపత్తు స్పందన దళం సిబ్బంది తొలగించారు. స్వచ్ఛభారత్​లో భాగంగా సుమారు 400 మంది ఎన్డీఆర్​ఎఫ్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించి పూజలు చేశారు.

పూజా సామగ్రితో పాటు పేరుకపోయిన ఇతర వ్యర్థాలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగించారు. ఇలాంటి కార్యక్రమాలను నెలకు రెండు చొప్పున నిర్వహిస్తామని ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ జహీద్ ఖాన్ వివరించారు. కృష్ణా నదిలో భారీ ఎత్తున వ్యర్థాలు పేరుకుపోయాయని సమాచారం అందిన మేరకు... ఈ చర్య తీసుకున్నట్టు చెప్పారు.

Last Updated : Mar 15, 2021, 11:04 AM IST

ABOUT THE AUTHOR

...view details