గుంటూరు జిల్లా నరసరావుపేట రెడ్‌జోన్‌లో ఉన్న వరవకట్ట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. నరసరావుపేటలో 150 పైనా కరోనా కేసులు నమోదవ్వటం వల్ల సమీపంలోని వరవకట్టలో నిబంధనలు విధించారు. అధికారులు పంపిణీ చేస్తున్న నిత్యావసరాలు సరిపోవడం లేదని గ్రామస్థులు రోడ్డెక్కారు.
రెడ్‌జోన్‌లో స్థానికుల ఆందోళన... ఎందుకంటే.. - ఏపీ లాక్ డౌన్ న్యూస్
గుంటూరు జిల్లా నరసరావుపేట పరిధిలోని వరవకట్ట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. జిల్లాలో అధికంగా కేసులు నమోదయిన నరసరావుపేటను ప్రభుత్వం రెడ్‌జోన్ చేసింది. గత రెండు నెలలుగా రెడ్‌జోన్ ఉన్న తమకు ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసరాలు సరిపోవటంలేదని గ్రామస్థులు ఆందోళన చేశారు. కూలీ పనులు చేసుకుని జీవించే తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకున్నారు.
గత రెండు నెలలుగా రెడ్‌జోన్‌లో ఉండడం వల్ల పనుల్లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు. అధికారులు అరకొరగా నిత్యావసరాలు అందిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పనులు చేసుకోడానికి బయటకు అనుమతి ఇవ్వడంలేదని, రోజు కూలీపై ఆధారపడి జీవించే తాము అద్దెలు, విద్యుత్తు బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకున్నారు. ఆందోళనకు దిగిన గ్రామస్థులకు పోలీసులు సర్థిచెప్పి ఇళ్లకు పంపించారు.
ఇదీ చదవండి :లాక్డౌన్ వల్ల వాళ్లకు మతి చెడింది: సాక్షి సింగ్