ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంత్యక్రియల ఖర్చును మున్సిపాలిటీయే భరిస్తుంది: ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి

గుంటూరు జిల్లా నరసరావుపేటలో కొవిడ్​తో మృతి చెందిన వారి మృతదేహాల అంత్యక్రియలకు శ్మశానవాటికలో ఎవరూ డబ్బులు ఇవ్వొద్దని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. దహన సంస్కారాలకు అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వం తరఫున స్థానిక మున్సిపాలిటీ చెల్లిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

narasaraopeta-mla-gopireddy-clarity-on-fees-of-covid-dead-bodies-cremation
నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

By

Published : May 12, 2021, 9:51 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నందున కొవిడ్ మృతదేహాలకు శ్మశాన వాటికల వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని... పలువురు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఒక్కో మృతదేహానికి సుమారు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి తెలియజేశారు.

ఈ అంశంపై స్పందించిన ఎమ్మెల్యే... కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ డబ్బులు ఇవ్వవద్దని, అందుకు అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వం తరఫున మున్సిపాలిటీ భరిస్తుందని వెల్లడించారు. అంతిమ సంస్కారాలకు డబ్బులు అడిగితే... తనకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details