గుంటూరు జిల్లాలోని నరసరావుపేట, వినుకొండ పరిధిలో ఎక్సైజ్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుబడింది. అనంతపురానికి చెందిన దండే క్రాంతికుమార్, కడపకు చెందిన దండే చైతన్యకుమార్ గోవాకు చెందిన మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. భారీ ఎత్తున మద్యం సీసాలను ఐషర్ లారీలో తీసుకొస్తుండగా పట్టుకున్నట్లు నరసరావుపేట ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖరరెడ్డి తెలిపారు. వీటిని నరసరావుపేట, వినుకొండ పరిధిలోని గ్రామాల్లో విక్రయదారులకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు.
GOA LIQUOR: ఎస్ఈబీ తనిఖీల్లో గోవా మద్యం పట్టివేత.. ఐదుగురి అరెస్ట్ - క్రైమ్ వార్తలు
గుంటూరు జిల్లాలో ఎస్ఈబీ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఒక లారీలో అక్రమంగా తరలిస్తున్న గోవా రాష్ట్రానికి చెందిన మద్యాన్ని గుర్తించారు. దీనికి సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ARREST
51 కేసుల్లో తరలిస్తున్న 2005 మద్యం సీసాల ఖరీదు రూ. 6.5 లక్షల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. మద్యాన్ని స్వాధీనం చేసుకుని లారీని సీజ్ చేసినట్లు తెలిపారు. మెుత్తం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని.. వారిపై కేసు నమోదు చేశామన్నారు.
ఇదీ చదవండి:దీర్ఘకాలం తాగితే అనారోగ్యమే..