ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజన్న రాజ్యం కాదు... రాక్షస రాజ్యం: నారా లోకేశ్​ - మీడియా సమావేశం

తెదేపా ఏర్పాటు చేసిన వైకాపా బాధితుల పునరావాస కేంద్రాన్ని సందర్శించిన నారా లోకేశ్​ అనంతరం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

'రాజన్న రాజ్యం కాదు...రాక్షస రాజ్యం : నారా లోకేష్'

By

Published : Sep 6, 2019, 6:32 PM IST

'రాజన్న రాజ్యం కాదు...రాక్షస రాజ్యం : నారా లోకేష్'

గుంటూరు జిల్లా అరండల్​పేటలో వైకాపా బాధితుల పునరావావాస కేంద్రానికి వెళ్లి పరామర్శించారు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​. వైకాపా ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. తెదేపాకు ఓటేసిన ప్రతి ఒక్కరినీ ఇబ్బందులు పెడుతున్నారనీ... వంద రోజులు సహనంగా ఓపిక పట్టినా ఇక సహించేది లేదంటూ హెచ్చరించారు. రాజశేఖర్​రెడ్డి హయాంలో కార్యకర్తలను చంపేసినట్లే, ఇప్పుడు జగన్ ఏడుగురు తెదేపా కార్యకర్తలు చంపేశారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచి, ఒక్కో కుటుంబానికి పది వేల ఆర్థిక సాయం, పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. వైకాపా నేతలు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనీ, బాధితులకు రక్షణ కల్పించకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details