గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామ సచివాలయంలో ఏఎన్ఎంగా పని చేస్తోన్న ఎస్సీ మహిళ స్థలాన్ని వైకాపా నేతలు కబ్జా(Land grab) చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(LOKESH) ఆరోపించారు. కబ్జాను ప్రశ్నించిన బాధిత మహిళ దాడికి గురై.. పోలీసుల్ని ఆశ్రయించినా రక్షణ దొరక్కపోవడం దారుణమని మండిపడ్డారు.
ఓ ఎస్సీ మహిళకు ఈ దుస్థితి ఎదురైతే.. సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. వైకాపా నేతల కన్నుపడితే కబ్జా(Land grab), అడుగుపెడితే ఆక్రమణేనని లోకేశ్ ధ్వజమెత్తారు. బాధిత మహిళ ఆవేదనకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.