Lokesh Meeting: ముస్లిం మైనార్టీ ప్రముఖులు, తెలుగుదేశం నేతలతో.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భేటీ అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ముస్లిం, మైనార్టీలపై దాడులు తీవ్రమయ్యాయని.. మైనార్టీల నిధులు దారి మళ్లించారని.. సంక్షేమ పథకాలు ఆపేశారని.. మైనార్టీ ప్రతినిధులు.. లోకేశ్ వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా.. మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన చెందారు. నంద్యాలలో ఓ కుటుంబం బలవన్మరణం, నరసరావుపేటలో మసీదు ఆస్తుల పరిరక్షణకు పోరాడిన టీడీపీ నేత దారుణ హత్య వంటి ఘటనలతో.. మైనార్టీలకు రాష్ట్రంలో రక్షణ లేదన్న విషయం స్పష్టమైందని లోకేశ్‌కు వివరించారు.
రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే : నారా లోకేశ్
Lokesh Meeting: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముస్లిం మైనార్టీ ప్రముఖులు, తెలుగుదేశం నేతలతో భేటీ అయ్యారు. మైనార్టీలకు తమ తరపున పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ముస్లిం, మైనార్టీలపై దాడులు తీవ్రమయ్యాయని మైనార్టీ ప్రతినిధులు లోకేశ్ వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ పాలనలో ఆర్థికంగానూ, సామాజికంగానూ మైనార్టీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. మైనార్టీల రక్షణ, సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. మైనార్టీల పోరాటానికి తెలుగుదేశం వైపు నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసిన లోకేశ్.. మైనార్టీలకు భద్రత కల్పిస్తామని, సంక్షేమానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. వైసీపీ హయాంలో మైనార్టీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని లోకేశ్ హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: