రాష్ట్రానికి రాజధాని లేకుండా వైకాపా ప్రభుత్వం చేస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మాజీమంత్రి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు వర్ధంతి కార్యక్రమానికి హాజరైన లోకేశ్... కోటేశ్వరరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజధానిపై మంత్రులు ఇష్టారీతిన మాట్లాడటాన్ని ఖండించారు. ఇన్‌సైడ్ ట్రేడింగ్ పేరిట రాజధాని తరలింపు యోచన చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధానిపై వైకాపా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
'రాజధానిపై స్పష్టతనివ్వండి' - nara lokesh on capital amaravathi
రాజధానిపై స్పష్టతనివ్వాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ డిమాండ్ చేశారు. రాజధాని అమరావతిని వైకాపా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. శాసనసభలో ఆనాడు ఆమోదం తెలిపి ఇవాళ విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు
రాజధానిపై నారా లోకేశ్