ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నామినేషన్లు వేసిన వారిలో.. నలుగురు మృతి

కరోనా కారణంగా నిలిచిన పురపాలక ఎన్నికలు నిర్వహించేందుకు.. ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. గతంలో నామినేషన్లు దాఖలు చేసిన వారు.. కొందరు మరణించినట్లు అధికారులు గుర్తించటంతో.. ఆ మేరకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

muncipal elections nominations in guntur district
నామినేషన్లు వేసిన వారిలో.. నలుగురు మృతి

By

Published : Feb 17, 2021, 8:47 AM IST

Updated : Feb 17, 2021, 2:16 PM IST

గుంటూరు జిల్లాలో పురపాలక ఎన్నికలో పోటీకి నామినేషన్లు దాఖలు చేసిన వారిలో నలుగురు చనిపోయారు. గుర్తింపు పొందిన లేదా రిజిస్టర్ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎవరైనా మరణిస్తే ఆ స్థానాల్లో ఎన్నికలు వాయిదా వేస్తామని ఇప్పటికే రాష్ట్ర ఎన్నిల సంఘం ప్రకటించింది. ఈమేరకు జిల్లాలోని ఎన్నికల జరుగుతున్న పట్టణాల్లో చనిపోయిన అభ్యర్థుల వివరాలను మున్సిపల్ వర్గాలు సేకరించాయి. గుంటూరు నగరపాలకలో ఇద్దరు కార్పొరేటర్ అభ్యర్థులు చనిపోయినట్లు నగరపాలక ధ్రువీకరించింది. అదేవిధంగా చిలకలూరిపేట, రేపల్లె, పురపాలికల్లో ఒక్కొక్కరో చొప్పున ఇద్దరు మృత్యవాత పడ్డారు. వీరంతా ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులుగా గుర్తించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారమిచ్చారు.

Last Updated : Feb 17, 2021, 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details