రాష్ట్ర సరిహద్దుల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం అంతర్రాష్ట్ర పొందుగల సరిహద్దులో ఆదివారం రాత్రంతా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సరిహద్దుల్లో రాత్రి 7నుంచి ఉదయం ఏడు గంటల వరకు వాహనాలకు అనుమతి లేని విషయం తెలిసిందే.
పొందుగల సరిహద్దులో వాహనదారుల ఇక్కట్లు - guntur news
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం అంతర్రాష్ట్ర పొందుగల సరిహద్దులో ఆదివారం రాత్రంతా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పొందుగల సరిహద్దులో వాహనదారులు ఇక్కట్లు
కానీ అంతర్రాష్ట్ర పోలీస్ చెక్ పోస్ట్ వద్ద గత వారం రోజులుగా ఎలాంటి వాహనాలు నిలపకపోవడంతో... వాహనదారులు సరిహద్దును దాటేవారు. అదే తరహాలో ఆదివారం సరిహద్దు దాటేందుకు వచ్చిన వందల వాహనాలను పొందుగల సరిహద్దులో అధికారులు నిలిపేశారు. ఈ సంఘటనతో రాత్రంతా దోమలతో వృద్దులు, బాలింతలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికైనా అధికారులు సరిహద్దు ఆంక్షలు తొలగించాలని వారు కోరుతున్నారు.