ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''223 జీవో రద్దు చేయండి.. పదోన్నతులివ్వండి''

సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పనిచేస్తున్న 800 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరించాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. స్కూల్ అసిస్టెంట్లు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు పొందేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

223 జీవోను రద్దు చేసి స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించాలి : కత్తి నరసింహారెడ్డి

By

Published : Jul 18, 2019, 6:33 AM IST

సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో కాంట్రాక్టు విధానం ద్వారా పనిచేసే ఉద్యోగుల సర్వీసులు క్రమబద్దీకరిస్తామని పాదయాత్ర సమయంలో సీఎం జగన్‌ హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి గుర్తు చేశారు. ఆ హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పనిచేసే 800 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరించాలన్నారు. 223 జీవో కారణంగా స్కూల్ అసిస్టెంట్లు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు పొందలేకపోతున్నారన్న నరసింహారెడ్డి... ఆ జీవోను వెంటనే రద్దు చేయాలన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details