తెదేపా పాదయాత్రలో ఘర్షణ
బాబు మళ్లీ సీఎం కావాలంటూ చేసిన పాదయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వర్గానికి , వ్యతిరేక వర్గానికి మధ్య గొడవకు ఈ ర్యాలీ దారితీసింది.
తెదేపా పాదయాత్రలో ఘర్షణ
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు మళ్లీ సీఎం కావాలంటూ జడ్పీ. వైస్.ఛైర్మన్ పూర్ణచందర్రావు ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యే వర్గీయులు పాదయాత్ర అడ్డుకోవడం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇది ఎవ్వరికీ వ్యతిరేకంగా చేసే ర్యాలీ కాదని పూర్ణచందర్ తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు.