అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం నాడు గుంటూరు జిల్లా తాడికొండ గ్రామంలో మహిళలతో కలిసి ఎమ్మెల్యే శ్రీదేవి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తాడికొండ బస్టాండ్ సెంటర్ నుంచి ట్యూబ్ లైట్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. వైకాపా ప్రభుత్వంలో మహిళలు అన్ని రంగాల్లో పైచేయి సాధిస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముగ్గురు మహిళలకు మంత్రి పదవులు ఇవ్వటంతో పాటు.. ఇద్దరు మహిళలను ఉపముఖ్యమంత్రులను చేసిన ఘనత సీఎం జగన్ మెహన్ రెడ్డికి దక్కుతుందన్నారు.
'వైకాపా పాలనలో మహిళలు అన్ని రంగాల్లో పైచేయి సాధిస్తున్నారు' - గుంటూరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వార్తలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాలో మహిళలతో కలసి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. వైకాపా ప్రభుత్వంలో మహిళలు అన్ని రంగాల్లో పైచేయి సాధిస్తున్నారన్నారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా..మిథాలి రాజ్, మేరీ కోమ్, సానియా మీర్జా లాంటి మహిళలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
'వైకాపా పాలనలో మహిళలు అన్ని రంగాల్లో పైచేయి సాధిస్తున్నారు'
మహిళలు వంటింటికే పరిమితం కాకుండా..మిథాలి రాజ్, మేరీ కోమ్, సానియా మీర్జాలాంటి మహిళలను ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీదేవిని తాడికొండ గ్రామ సర్పంచ్ తోకల సరోజినీ, నరసింహరావులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి