తెదేపా నేతలపై ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ విమర్శలు గుప్పించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకి ద్రవ్య బిల్లు ప్రాధాన్యత తెలియదా? అని ప్రశ్నించారు. మండలిలో తెదేపా నేతలు రౌడీయిజం చెలాయించారని.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పైనా.. దాడికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. దాడికి పాల్పడిన తెదేపా ఎమ్మెల్సీలు మంత్రి వెల్లంపల్లికి క్షమాపణలు చెప్పాలని మద్దాలి గిరి డిమాండ్ చేశారు.
మండలిలో తెదేపా నేతలు రౌడీయిజం చేశారు..: మద్దాలి గిరి - ఎమ్మెల్సీలపై మద్దాలి గిరి కామెంట్స్
తెదేపా నేతలు వ్యవహరించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ విమర్శించారు. మండలిలో ద్రవ్య బిల్లులను అడ్డుకుని ఇష్టానుసారంగా వ్యవహరించి.. మంత్రులపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు.
mla maddali giri comments on tdp