జగన్ సీఎం కావడం అసాధ్యం: ఆంజనేయులు - jagan
వైకాపా అధినేత, మోదీ తలక్రిందులుగా తపస్సు చేసినా... జగన్ ముఖ్యమంత్రి కావడం అసాధ్యమని వినుకొండ శాసనసభ్యుడు జీవి ఆంజనేయులు విమర్శించారు.

జగన్మోహన్ రెడ్డి , మోదీ తలక్రిందులుగా తపస్సు చేసినా... జగన్ ముఖ్యమంత్రి కావడం అసాధ్యమని వినుకొండ శాసనసభ్యుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, విజయసాయి రెడ్డి హోమ్ మినిస్టర్ అయిపోయినట్లుగా వైకాపా నేతలు పగటి కలలు కంటున్నారని జీవీ ఆంజనేయులు ఎద్దేవాచేశారు.
వైకాపా నేతలు అనేక అల్లర్లు, దాడులు చేసి ఓటింగ్ శాతం పెరగకుండా అడ్డుకున్నారని విమర్శించారు. ఓటర్లు సహనంతో ఓట్లు వేసి ధర్మం గెలవాలని తీర్పును ఇచ్చారన్నారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమైందని, మోదీ, జగన్... కనుసన్నల్లో జగన్ ఈసీ పని చేస్తోందని విమర్శించారు.