ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఖరీఫ్ పంట నీటి విడుదలకు ఆటంకం లేకుండా చూడాలి' - సాగర్ నీటి విడుదల వార్తలు

గుంటూరు జిల్లాలో వ్యవసాయ సలహా మండలి, జిల్లా నీటి పారుదల సలహా మండలి అధికారులతో మంత్రి శ్రీరంగనాథ రాజు సమావేశాన్ని నిర్వహించారు. ఖరీఫ్ పంట నీటి విడుదలకు ఆటంకం లేకుండా చూడాలన్నారు. కాలువలు,డ్రైయిన్లలో వార్షిక మరమ్మతులకు ఈ నెల 15లోగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి జూన్ నెలాఖరు నాటికి పనులను పూర్తి చేయాలన్నారు.

Minister Sriranganatha Raju  zoom meeting
మంత్రి శ్రీరంగనాథ రాజు

By

Published : Jun 1, 2021, 10:01 PM IST

గుంటూరు జిల్లాలో వ్యవసాయ, సాగు నీటి పారుదల అంశాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు ఆదేశించారు. వర్చువల్ విధానంలో మంత్రి శ్రీరంగనాథరాజు అధ్యక్షతన జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి, జిల్లా నీటి పారుదల సలహా మండలి అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.

నీటి పారుదల శాఖలోని అభివృద్ది పనులు, రాబోయే ఖరీఫ్ పంటకు నీటి విడుదల అంశాలపై మంత్రి చర్చించారు. గోదావరిలోని నీటి లభ్యత ఆధారంగా కృష్ణా పశ్చిమ డెల్టా రైతులకు జులై 1న.. నాగార్జున సాగర్ ప్రాజెక్టులోని నీటినిల్వ ఆధారంగా ఆయకట్టు రైతులకు ఆగస్టు 15న నీటిని విడుదల చేయడానికి తీర్మానించారు. కాలువలు, డ్రైయిన్లలో వార్షిక మరమ్మతులకు ఈ నెల 15లోగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి జూన్ నెలాఖరు నాటికి పనులను పూర్తి చేయాలన్నారు.

ఇదీ చదవండి

Southwest monsoon: ఈ నెల 3న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

ABOUT THE AUTHOR

...view details