ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వైకాపా వ్యవహరిస్తోందని మంత్రి కాలవ శ్రీనివాసులు అమరావతిలో అన్నారు. జగన్‌కు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ఎద్దేవా చేశారు. మోదీతో కలిసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జగన్ ద్వారా రాష్ట్రంలో బలహీన నాయకత్వం రావాలని కేసీఆర్ కోరుకుంటున్నారన్నారు. దక్షిణాది నాయకత్వం బలహీనపరిచేలా భాజపా ఎత్తులు వేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ పోలీసులు, ప్రభుత్వ సహకారంతో పార్టీ డేటాను దొంగిలించారన్నారు. లోటస్‌పాండ్‌లో కూర్చుని జగన్, కేటీఆర్ కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు.
'వారి చేతిలో జగన్ కీలుబొమ్మ' - modi
ప్రధాని మోదీ, కేసీఆర్ ల చేతిలో జగన్మోహన్ రెడ్డి కీలుబొమ్మలా మారారని.. మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వైకాపా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. లోటస్‌పాండ్‌లో కూర్చుని జగన్, కేటీఆర్ కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు.
కాలవ శ్రీనివాసులు