ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జీజీహెచ్​ను సందర్శించిన మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ్ - ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్

గుంటూరు జీజీహెచ్​లో రోగుల సహాయార్ధుల కోసం ఏర్పాటు చేసిన భోజనశాలను అందుబాటులోకి తీసుకువస్తామని జిల్లా ఇన్​చార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ్ రాజు అన్నారు. డిసెంబర్ నాటికి భవన నిర్మాణాన్ని పూర్తి చేసి రోగుల సహాయకులకు ఉచిత భోజనం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Minister Cherukuvada Sriranganath raju
గుంటూరు జిజిహెచ్ ను సందర్శించిన మంత్రి చేరుకువాడ శ్రీరంగనాధ్

By

Published : Nov 12, 2020, 8:11 AM IST

గుంటూరు జీజీహెచ్​లో రోగుల సహాయకుల కోసం ఏర్పాటు చేసిన భోజనశాలను అందుబాటులోకి తెస్తామని జిల్లా ఇన్​చార్జ్ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ్ రాజు తెలిపారు. జీజీహెచ్​లో పర్యటించిన ఆయన.. నిర్మాణంలో ఉన్న భోజనశాల భవనాన్ని పరిశీలించారు. భవన నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. డిసెంబర్ నాటికి పూర్తి చేసి రోగుల సహాయకులకు ఉచితంగా భోజనం అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. జీజీహెచ్ ఉన్నంత కాలం ఉచిత భోజన సదుపాయం అమలలో ఉంటుందని చెప్పారు.

జీజీహెచ్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల కోట్ల రూపాయల నిధులను కేటాయించిందని అన్నారు. జీజీహెచ్లో మరిన్ని మెరుగైన సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, ముస్తఫా, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్.ప్రభావతి... పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details