ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Sangam Dairy: సంగం డెయిరీ ముమ్మాటికీ ప్రభుత్వానిదే: మంత్రి సీదిరి

సంగం డెయిరీ (Sangam Dairy) ముమ్మాటికీ ప్రభుత్వానిదేనని..దాన్ని దక్కించుకునేందుకు న్యాయపరంగా పోరాడుతూనే ఉంటామని మంత్రి సీదిరి అప్పలరాజు (Minister Appalaraju) చెప్పారు. గుంటూరులో హోం మంత్రి సుచరితతో కలిసి పశుసంవర్థక శాఖపై (Department of Animal Husbandry) సమీక్షించిన ఆయన...పాడి రైతులకు మేలు చేసేందుకే అమూల్‌తో (Amul) ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.

సంగం డెయిరీ ముమ్మాటికీ ప్రభుత్వానిదే
సంగం డెయిరీ ముమ్మాటికీ ప్రభుత్వానిదే

By

Published : Sep 7, 2021, 8:46 PM IST

సంగం డెయిరీ ముమ్మాటికీ ప్రభుత్వానిదే

సంగం డెయిరీ (Sangam Dairy) ముమ్మాటికీ ప్రభుత్వానికి (AP Government) చెందినదేనని...ఈ డెయిరీని దక్కించుకునేందుకు న్యాయపరంగా మరింత ముందుకు వెళతామని రాష్ట్ర పశు సంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు (Minister Appalaraju) అన్నారు. గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో హోంమంత్రి మేకతోటి సుచరితతో (Home Minister Sucharita) కలిసి పశు సంవర్థకశాఖ (Department of Animal Husbandry) పనితీరుపై ఆయన సమీక్ష (Review) నిర్వహించారు. గతంలో డెయిరీ సహకార వ్యవస్థను ప్రైవేటుపరం (Privatization) చేశారని...జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రైతులకు మేలు జరిగేలా అమూల్​తో (Amul) ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. దీనిపై ప్రతిపక్షాలు (Opposition Parties) ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.

పాడి రైతులు (Farmers) బాగుంటేనే మిగతా సమాజం బాగుపడుతుందని..రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సహకార డెయిరీలు (Women Corporation Dairy's) ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి 10 రోజులకొకసారి వారి ఖాతాల్లో (Accounts) డబ్బులు జమ చేయనున్నట్లు మంత్రి అప్పలరాజు స్పష్టం చేశారు. అమూల్​తో ఒప్పందం (Agreement) చేసుకోవడం వల్ల ఒక్కో రైతుకు లీటరకు 5 నుంచి 10 రూపాయలు అదనంగా లభిస్తుందని చెప్పారు.

"సంగం డెయిరీ ముమ్మాటికీ ప్రభుత్వానికే చెందుతుంది. దానిని వెనక్కి తీసుకునేందుకు న్యాయపరంగా ముందుకెళ్తాం. ప్రభుత్వ ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం. రైతులకు మేలు చేసేందుకే అమూల్​తో ఒప్పందం కుదుర్చుకున్నాం."సీదిరి అప్పలరాజు, పశుసంవర్థకశాఖ మంత్రి

ఇదీ చదవండి

CM Jagan: నూతన విద్యా విధానం అమలుకు సిద్ధం కావాలి: ముఖ్యమంత్రి జగన్

ABOUT THE AUTHOR

...view details