సమీక్ష చేయొద్దనే అధికారం ఎవరికీ లేదు: ఆనందబాబు
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై సమీక్ష చేయవద్దనే అధికారం ఎవరికీ లేదని మంత్రి ఆనందబాబు స్ఫష్టం చేశారు. ఏమైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే ఈసీ అడగొచ్చని చెప్పారు. మరోసారి తెదేపా అధికారంలోకి రావటం ఖాయమని ఆనందబాబు ధీమా వ్యక్తం చేశారు.
సమీక్ష చేయవద్దనే అధికారం లేదు: మంత్రిఆనందబాబు
పథకాలపై సమీక్ష చేయవద్దనే అధికారం ఎవరికీ లేదని గుంటూరు తెదేపా రాష్ట్ర కార్యాలయంలో మంత్రి ఆనందబాబు స్పష్టం చేశారు. విధానాపరమైన నిర్ణయాలు తీసుకుంటేనే ఈసీ అడగొచ్చని చెప్పారు. ప్రజలు తమను ఎన్నుకున్నారనే విషయాన్ని సీఎస్ గుర్తించాలని అన్నారు. వీవీ ప్యాట్ స్లిప్పులు కచ్చితంగా లెక్కించాలని..పారదర్శకతే ముఖ్యమని ఆయన తేల్చిచెప్పారు. శ్రీలంక ఘనటపై ప్రధాని మోదీ, ఇంటర్ ఫలితాల వివాదంపై కేసీఆర్ సమీక్ష చేయలేదా అని ఈసీని ప్రశ్నించారు.