గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని పొందుగుల సరిహద్దు వద్ద వలస కూలీలు ఆందోళన చేశారు. తమను స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అధికారులు తమకు అనుమతి ఇచ్చినప్పటికీ రాష్ట్ర పోలీసులు ఆపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రానందున్న వాహనాలను అడ్డుకున్నామని పోలీసులు తెలిపారు.
పొందుగుల సరిహద్దు వద్ద వలస కూలీల ఆందోళన - గుంటూరు జిల్లావార్తలు
రాష్ట్రంలోని సరిహద్దుల్లో మరోమారు ఉద్రిక్తత నెలకొంది. కేంద్రం లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో పాటు వలస కార్మికులను స్వస్థలాలకు పంపిస్తామని ప్రకటించగా... వారు స్వస్థలాలకు పయనమయ్యారు. రాష్ట్రంలోని సరిహద్దుల్లో మాత్రం తమను పోలీసులు అడ్డుకోవడంపై కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పొందుగుల సరిహద్దు వద్ద వలస కూలీల ఆందోళన