ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో భాజపా బలోపేతానికి చర్యలు : కన్నా - kanna laxmi narayana

రాష్ట్రంలో భాజపా బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కోర్ కమిటీలో చర్చించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. సమావేశం నేడూ కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు.

కన్నా

By

Published : Jun 30, 2019, 5:22 AM IST

Updated : Jun 30, 2019, 10:12 AM IST

గుంటూరు జిల్లా మంగళగిరిలోని హాయ్ ల్యాండ్​లో భాజపా కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి మురళీధరన్​తో పాటు ఏపీకి చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో భాజపా బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో ముఖ్యంగా చర్చించినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. జులై 6వ తేది నుంచి పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వీలైనంత ఎక్కువగా సభ్యత్వ నమోదు చేయడానికి ప్రయత్నిస్తమన్నారు. దేశంలో భాజపా ప్రధాన శక్తిగా ఆవిర్భవించిందని.. అందుకే ఇతర పార్టీల నాయకులు తమ పార్టీ వైపు దృష్టి సారించారని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. పార్టీలో చేరికలు ఇకపై నిరంతరం జరుగుతూనే ఉంటాయన్నారు. కోర్ కమిటీ సమావేశం నేడు కూడా కొనసాగుతుందని నేతలు చెప్పారు.

రాష్ట్రంలో భాజపా బలోపేతనానికి చర్యలు
Last Updated : Jun 30, 2019, 10:12 AM IST

ABOUT THE AUTHOR

...view details